Ajit Pawar vs Sharad Pawar: మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభంలో స్పీకర్ ఎందుకంత కీలకమయ్యారు?

సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..

Ajit Pawar vs Sharad Pawar: మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభంలో స్పీకర్ ఎందుకంత కీలకమయ్యారు?

Updated On : July 4, 2023 / 9:32 PM IST

NCP vs NCP: మహారాష్ట్రలో కొనసాగుతున్న పవార్ వర్సెస్ పవార్ సంక్షోభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కీలకంగా మారారు. కారణం.. అజిత్ పవార్ సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మంది తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ వేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ ముందుకు వచ్చింది. దీనిపై స్పీకర్ విచారణ చేసి 1989 ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది అనుకున్న సమయంలో జరగడం లేదు. కారణం.. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం. లేదంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధమైన వ్యక్తులు కావడం వల్ల.. ఈ నిర్ణయాల్లో ప్రభావం పడుతోంది.

NCP vs NCP: అజిత్ పవార్‭కు గట్టి వార్నింగ్ ఇచ్చిన శరద్ పవార్

ఫిరాయింపు నిరోధక చట్టంలోని కొన్ని లోపాల కారణంగా ఇది తరుచూ విమర్శలకు గురవుతోంది. చట్ట సభలో బలం ఉన్న పార్టీ ఈ లోపాలను ఉపయోగించుకుంటోందనే విమర్శ బహిర్గతమే. సాధారణంగా వినిపించే ఆందోళన ఏంటంటే.. అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవడాన్ని స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్లైతే రాజకీయ పార్టీలు మారిన నేతలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రభావం పడకపోగా.. కోర్టు జోక్యాన్ని కూడా తప్పించుకోగలరు.

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి రాహుల్ నర్వేకర్ స్పీకర్‭గా ఉన్నారు. ఎన్సీపీ మీద తిరుగుబాటు చేసిన నేతలు బీజేపీ-శివసేన ప్రభుత్వంతో చేతులు కలపడం వల్ల వీరిపై వేటు పడకుండా స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ తీసుకునే సమయానికి సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ఖచ్చితమైన టైమ్‌లైన్ అనేది ఏర్పాటు చేయలేదు.

Dhulipalla Narendra : ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారు : ధూళిపాళ్ల

అయితే 2020లో కీషమ్ మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకమైందని చెప్పొచ్చు. ఈ తీర్పులో మూడు అంశాలను సుప్రీం ప్రధానంగా స్పష్టం చేసింది. ‘స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకునే సమయం, అనర్హతలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సరైన వ్యక్తి అవునా కాదా అని నిర్ణయించడానికి పార్లమెంటుకు సూచించడం, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే కోర్టు జోక్యం చేసుకునే అధికారం’ వంటి వాటి గురించి కోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది.

Bandi Sanjay: బండి సంజయ్ ఔట్.. ఎక్కడ తేడా కొట్టింది.. కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

అనర్హత పిటిషన్‌లను నిర్ణయించడానికి మూడు నెలల పరిమితిని విధించాలని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోకపోవడంతో అలాంటి పరిమితి ఏదీ లేకుండా పోయింది. దీంతో అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోదు. పదవ షెడ్యూల్‌ ప్రకారం అనర్హతపై స్పీకర్‌‭దే తుది నిర్ణయం. అయితే కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రం కోర్టు జోక్యం చేసుకుంటోంది.

ఏది ఏమైనప్పటికీ, ఒక సహేతుకమైన కాలపరిమితిని ఏర్పరుస్తుందనేది ఆ సందర్భంలోని నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, పదవ షెడ్యూల్‌లోని వివాదాలను పరిష్కరించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలోని శాశ్వత ట్రిబ్యునల్ వంటి స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణను పరిగణించాలని పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించబడింది. స్పీకర్ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా కొనసాగుతున్నప్పుడు క్వాసీ-జుడీషియల్ అథారిటీగా స్పీకర్‌కు అప్పగించాలా వద్దా అనే దానిపై పార్లమెంటు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Mayawati: మాయావతి లేకుంటే విపక్షాలు ఏమీ చేయలేవు.. మరింత డోస్ పెంచిన ఓం ప్రకాష్ రాజ్‭భర్

‘‘లోక్‌సభ, శాసనసభల్లో అనర్హతల అనిశ్చితిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని శాశ్వత ట్రిబ్యునల్‌ ఉపయోగకరంగా ఉంటుంటి. ఇలాంటి వివాదాలు త్వరగా, నిష్పక్షపాతంగా పరిష్కరించబడేలా కోర్టు లేదా ఇతర స్వతంత్ర యంత్రాంగం పరిష్కారమార్గంగా ఉంటుంది. తద్వారా మన ప్రజాస్వామ్యం సరైన పనితీరులో పయనించడంతో పాటు పదవ షెడ్యూల్ నిబంధనలకు మరింత బలాన్ని ఇస్తుంది’’ అని కోర్టు పేర్కొంది.

అనర్హత వేటుపై ఆలస్యమైతే కోర్టులు జోక్యం చేసుకోగలవా?
2007 నాటి రాజేంద్ర సింగ్ రాణా కేసులో స్పీకర్ అధికార పరిధిని అమలు చేయడంలో విఫలమైతే న్యాయ సమీక్షకు అవకాశం కల్పిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2020నాటి తీర్పులో స్పీకర్ ఆలస్యంలో కోర్టు జోక్యం సమస్యను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. స్పీకర్ ఒక పిటిషన్‌ను సహేతుకమైన సమయంలో నిర్ణయించకుండా ఉంటే, అది న్యాయ సమీక్ష కోసం కోర్టును ఆశ్రయించే అంశంగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే పదవ షెడ్యూల్ పేరా 6లో ఉన్న షీల్డ్ అనేది స్పీకర్ అధికార పరిధిని నిర్ణయించిందని, దీని ప్రకారం.. ఒక వ్యక్తి అనర్హులవుతారా లేదా అనే దానిపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని కోర్టు స్పష్టం చేసింది.

పార్లమెంటు పాత్ర
జులై 2021లో ఇచ్చిన తీర్పులో, స్పీకర్ అనర్హత పిటిషన్‌లను సకాలంలో పరిష్కరించేందుకు చట్టాలను రూపొందించడం పార్లమెంటుకు ఉన్న ప్రత్యేక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే దీనిపై కాలపరిమితిని నిర్ణయిస్తూ చట్టం చేయడం సాధ్యం కాదని కోర్టు నొక్కి చెప్పింది. 2020 తీర్పుకు కొంచెం విరుద్ధంగా అప్పటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది సభ ప్రత్యేక హక్కు, శాసనసభ పరిమితులను కోర్టు నిర్ణయిందని పేర్కొన్నారు.

మార్చి 2023లో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యక్తం చేసిన విధంగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనర్హత కేసుల అంశం ఆందోళన కలిగిస్తుంది. అనర్హత పిటిషన్‌లను నిర్ణయించడానికి కాలపరిమితి ఉండాలా వద్దా అని న్యాయస్థానం ఆలోచించింది. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనర్హత పిటిషన్లు విచారణలో ఉండగానే అసెంబ్లీ రద్దవుతున్నాయి. వీటి పరిష్కారం ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఇది తికమక పెట్టే సమస్యని సుప్రీంకోర్టు ఒక సందర్భంలో పేర్కొంది.

స్పీకర్ అథారిటీ
సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పులో, అసాధారణమైన పరిస్థితులు ఉంటే తప్ప, పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లను నిర్ణయించే సముచిత అధికారం స్పీకర్‭దేని ధృవీకరించింది. రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా అనర్హత పిటిషన్లను తొలిదశలో నిర్ణయించడం మానుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా, శివసేన నేతల పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ను చంద్రచూడ్ ఆదేశించారు.

సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ.. ఫిరాయింపుల చట్టంలో పేర్కొన్న విధంగా 2/3 మంది నేతలు పార్టీ మారినప్పుడు లేజిస్లేచర్ పార్టీ మారినట్టుగా భావించాలి కాబట్టి.. షిండే వర్గం అనర్హతకు గురి కాలేదు. పైగా ఆ సమయంలో కోర్టు జోక్యం కూడా ఉపయోగపడింది.

Pawan Kalyan Instagram Followers : ఇన్‌స్టాగ్రామ్‎ను షేక్ చేస్తున్న పవర్ స్టార్

కానీ, నేటి సందర్భంలో అలా కాదు. అజిత్ పవార్ వర్గంలో అంత ఎక్కువ మంది సభ్యులు కనిపించడం లేదు. అదే చట్టం ప్రకారం చూస్తూ.. అనర్హత వేటు పడే అవకాశం ఉంది. నిజంగానే స్పీకర్ ఈ వైపు నిర్ణయం తీసుకుంటే అజిత్ పవార్ సహా మరో ఎనిమిది మంది మంత్రులు తమ పదువులు కోల్పోతారు. కానీ స్పీకర్ అధికార పార్టీ నేత కాబట్టి అలా జరక్కపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా.. శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్ మీద అసెంబ్లీలో ఎలాంటి హైడ్రామా జరుగుతుందో చూడాలి.