5వ లిస్ట్‌పై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ.. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు..!

మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్.

5వ లిస్ట్‌పై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ.. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు..!

Fifth List Tension In YCP Leaders

Updated On : January 24, 2024 / 8:21 PM IST

YCP Fifth List : వైసీపీలో మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. మరో లిస్టు త్వరలో రానుంది. సుమారు 15 మార్పులతో 5వ లిస్టు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ అధిష్టానం. అంతేకాకుండా ఇప్పటికే మార్పులు చేసిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మార్పులు మళ్లీ ఉండొచ్చు అనే సంకేతాలు ఇస్తోంది వైసీపీ అగ్రనాయకత్వం.

Also Read : వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?

మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్. 15 మార్పులతో 5వ లిస్టు రానుందన్న సమాచారంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, మళ్లీ మార్పులు ఉండొచ్చు అనే వార్త వారిని ఆందోళనకు గురి చేస్తోంది.