కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కు ఇష్టం లేదు : ఎమ్మెల్యే రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. శనివారం (డిసెంబర్ 21, 2019) తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరుతో దోచుకోవాలనుకుంటున్న లింగమనేని, టీడీపీ బినామీలకు ఏమైపోతోందో అని భయపడుతున్నారని విమర్శించారు. పవన్ కర్నూలులో పర్యటించిన సందర్భంగా కర్నూలుకు రాజధాని రావాలని చెప్పారని…ఇప్పుడు హైకోర్టు కూడా రాకూడదంటున్నారంటే ఉత్తరాంధ్ర, రాయలసీమపై అభిమానం లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రేమంతా లింగమనేనికి, టీడీపీ బినామీలకు ఏమైపోతుందోనన్న ఆలోచన ఉంది తప్ప రాష్ట్ర అభివృద్ధిపై లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో జగన్ కు ప్రజలందరు, తామూ అండగా ఉంటామన్నారు. జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు.
అంతకముందు తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రాజ్ భవన్, అసెంబ్లీ, ఎడ్యుకేషన్ హబ్, ఎయిమ్స్ ఉంటుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరాతికి ఎలాంటి నష్టం జరుగదన్నారు.
కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉందని గుర్తు చేశారు. గతంలో నష్టపోయినట్లు భవిష్యత్ లో నష్టపోకూడదని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. వైజాగ్ లో సెక్రటేరియట్, క్యాంప్ ఆఫీస్ పెట్టాలని అక్కడున్న ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆలోచన అన్నారు. అమరావతిలో ఏదో నష్టమైపోతుందని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.