షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!

దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి మినహా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనేది వ్యూహం. రంగం సిద్ధం అయ్యింది. నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభం అయ్యింది. షెడ్యూల్ కూడా వచ్చేసింది. సరిగ్గా ఇక్కడే మళ్లీ జగన్ డైలమాలో పడ్డారంట. దగ్గుబాటి హితేష్ కు టికెట్ కేటాయింపుపై తర్జనభర్జన పడుతున్నారంట. దీనికి కారణం లేకపోలేదు..
Read Also : ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా
దగ్గుబాటి హితేష్ ది అమెరికా పౌరసత్వం. ఆ దేశం అబ్బాయి.. మనదేశంలోని పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ఎన్నికల నిబంధనలు అడ్డుగా ఉన్నాయంట. అమెరికా పౌరసత్వం రద్దుపై పార్టీలో జాయిన్ అయ్యే సమయానికి క్లారిటీ ఇచ్చిందంట దగ్గుబాటి ఫ్యామిలీ. అమెరికా సిటిజన్ షిప్ వదలుకుంటున్నాం అని.. ఇండియాలో ఓటు తీసుకుంటున్నాం అని వెల్లడించారంట. అయితే ఇప్పటి వరకు ఇంకా హితేష్ అమెరికా పౌరసత్వం రద్దు కాలేదంట. దీంతో టికెట్ ఎలా ఇవ్వాలనే దానిపై డైలమాలో పడ్డారంట జగన్. నామినేషన్ గడువు సమీపిస్తోంది.. ఇంకా హితేష్ అమెరికా పౌరసత్వం రద్దు కాలేదు.. ఎలా అని ఆలోచిస్తున్నారంట.
దగ్గుబాటి ఫ్యామిలీకి టికెట్ అయితే ఇవ్వటం కన్ఫామ్ అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. హితేష్ కు కాకపోతే వెంకటేశ్వరరావు రంగంలోకి దిగుతారని.. ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఇప్పుడు కుమారుడికి కాకుండా మళ్లీ తనే బరిలోకి దిగితే ఉపయోగం ఏంటీ అంటున్నారు. హితేష్ అమెరికా పౌరసత్వం త్వరలోనే రద్దు అవుతుందని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అన్ని చూసుకునే పార్టీ టికెట్ అడుగుతున్నాం అనేది దగ్గుబాటి ఫ్యామిలీ వాదన. చూడాలి ఏం జరుగుతుందో…