మహిళా స్వరం : పోకిరి డైలాగ్ చెప్పిన రోజా

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 01:09 AM IST
మహిళా స్వరం : పోకిరి డైలాగ్ చెప్పిన రోజా

Updated On : January 30, 2019 / 1:09 AM IST

రాజమండ్రి : ఆడవారిని ఉద్దరిస్తానని అబద్దాలు చెబుతూ  అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మహిళలంతా కలిసి బుద్ది చెప్పాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత రోజా. రాజమండ్రిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వరం కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. అంతకు ముందు కంబాల చెరువు నుండి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రోజా స్వయంగా బైక్‌ నడుపుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆమె పంచ్ డైలాగ్‌‌లతో సభను అదరగొట్టారు.