వరల్డ్ రికార్డు : అతి పెద్ద మట్టి ప్రమిద

ఈ ఏడాది దీపావళికి ప్రపంచంలో అతి పెద్దదైన మట్టి ప్రమిదలో దీపాన్ని వెలింగించి రికార్డు సృష్టించారు గుహవటి వాసులు. దీపావళి రోజు కాస్తంత నూనె, చిన్నపాటి వత్తి, ప్రమిదలోవేసి సాధారణంగా మనం ఇంటి దగ్గర దీపం వెలిగిస్తాం. కానీ గుహవటిలో వెలిగించిన మట్టి ప్రమిద వ్యాసార్ధం 8 అడుగులు వెడల్పు, రెండు అడుగులు ఎత్తులో ఉంది. దీనిలో 200 లీటర్లు నూనె పడుతుంది. చిన్నపాటి పగ్గం తాడు ముక్కను ఇందులో వత్తిగా వేయాల్సి ఉంటుంది.
గుహవటిలోని దిఘోలి పఖూరి సరస్సు ఒడ్డున మ్యాక్స్ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసిన ఈ భారీ దీపాన్ని అక్టోబరు 26 సాయంత్రం గుహవటి గవర్నర్ జగదీష్ ముఖి వెలిగించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చే ప్రమాదాలపై అవగాహన కల్పించడం,2022 నాటికి ప్లాస్టిక్ వాడకాన్నినిషేధించాలని, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపోందిచేలా ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు ఈ మట్టి దీపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అక్టోబరు 31 సాయంత్రం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం గోరఖ్ పూర్ కు చెందిన సూరజ్ కుండ్ ధామ్ సమితి, లక్ష్మీ పూజ నాయువాక్ వారు వెలిగించిన 101 లీటర్ల నూనె పట్టే 150 కిలోల ప్రమిద రికార్డును శనివారం వెలిగించిన మట్టి ప్రమిద అధిగమించింది.