Indrakeeladri Giri Pradakshina: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ.. ఎప్పటి నుంచి అంటే..
భక్తులు సమయానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అధికారుల సూచించారు.
Indrakeeladri Giri Pradakshina: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణకు భక్తులకు అనుమతి ఇచ్చారు. మే 31 ఉదయం 5.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. భక్తులందరూ పాల్గొనవచ్చని ఈవో వి.కె.శీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సకల దేవతలు కొలువైన పవిత్ర క్షేత్రంగా ఇంద్రకీలాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పౌర్ణమి వేళ భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులు సమయానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అధికారుల సూచించారు.
