Dhanatrayodashi : ధనత్రయోదశిరోజున 8వస్తువులు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు..

ధనత్రయోదశి రోజున ధనియాలను కొనుగోలు చేసి అమ్మవారి ముందు పూజలో ఉంచాలి. ఆతరువాత రోజు ఆ ధనియాలను ఇంటి పెరట్లోకాని, కుండీలో కాని గుంటతవ్వి పాతిపెట్టాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నత పొందవచ్చు.

Dhanatrayodashi : ధనత్రయోదశిరోజున 8వస్తువులు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు..

Deepawali1

Updated On : November 1, 2021 / 11:49 AM IST

Dhanatrayodashi : ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏడాది పొడవునా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ధనత్రయోదశి రోజు వెండి, రాగి, ఇత్తడి, బంగారం వీటిల్లో ఏదైనా కొనుగోలు చేయాలి. వీటిల్లో ఏదైనా సరే స్ధోమతకు తగ్గట్టు కొనుగోలు చేస్తే మంచిది. బంగారం కొనలేని వారు తమచేతిలో ఉన్న డబ్బుకు తగ్గట్టు చిన్నవస్తువునైనా కొనుగోలు చేయాలి. అలా చేయటం వల్ల ఏడాది మొత్తం ఎలాంటి అనారోగ్యసమస్యలు లేకుండా జీవించవచ్చు.

అదే విధంగా ధనత్రయోదశి రోజున ధనియాలను కొనుగోలు చేసి అమ్మవారి ముందు పూజలో ఉంచాలి. ఆతరువాత రోజు ఆ ధనియాలను ఇంటి పెరట్లోకాని, కుండీలో కాని గుంటతవ్వి పాతిపెట్టాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నత పొందవచ్చు. ఏడాది మొత్తం శుభఫలితాలు పొందవచ్చు. అయితే ఇంట్లో మన పోపుల పెట్టెలో ఉండే ధనియాలు మాత్రం పూజకు వినియోగించవద్దు. దీపావళి సమయంలో ఏది కొన్నా కొనకపోయినా మట్టి ప్రమిదలు మాత్రం కొనుగోలు చేయటండి. పాత ప్రమిదలు మాత్రం వినియోగించవద్దు. కొత్త మట్టి ప్రమిదలు కొనుగోలు చేసి అందులో దీపారాధన చేయటం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.

ధనత్రయోదశిరోజున కొత్త చీపురును కొనుగోలు చేయటం మంచిది. లక్ష్మీ పూజలో కొత్త చీపురు ను ఉంచి పూజిస్తారు. కొత్త చీపురును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దీనితోపాటు 11 లక్ష్మీ గవ్వలు ఇంటికి కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. ఒకవేళ గవ్వలు దొరకని పక్షంలో గోమతి చక్రాలు కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఈరెండింటిలో ఏదైనా కొనుగోలు చేసి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ పూజసామాగ్రి లభించే దుకాణంలో లభిస్తాయి. ధనత్రయోదశి రోజున కల్లు ఉప్పు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఇలా చేయటం వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవులు, చికాకులు తొలగిపోతారు. అంతా ఆనందంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. కల్లు ఉప్పుతో ఇంటిని కడిగి శుభ్రం చేసుకుంటే అలక్ష్మీ ఇంటినుండి బయటకు వెళ్ళిపోతుంది. ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయాల్సిన మరో వస్తువు ఏడు ముఖాల రుద్రాక్షలు. ఏడు ముఖాల రుద్రాక్షలు దొరకని పక్షంలో ఐదు రుద్రాక్షలు దొరికినా కొని తెచ్చుకుని ఇంట్లో పూజగదిలో ఉంచుకోవాలి.

వీటితోపాటు ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసే శక్తిని బట్టి ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీపావళి రోజున ఇంట్లో పాతపనికి రాని వస్తువులు, బట్టలు, అన్నీ ఇంట్లో నుండి తొలగించటం మంచిది. దీపావళి పండుగరోజున లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించే సమయంలో అలక్ష్మీని బయటకు పంపటం మంచిది. అలా చేయకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ధన త్రయోదశి రోజున ఏ వస్తువును కొన్నా కొనకపోయినా చీపురు, కల్లు ఉప్పు మాత్రం కొనుగోలు చేయటం మర్చిపోకండి..వాటిని కొనుగోలు చేయటం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.