Statue Of Equality : శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు.. నేడు రాష్ట్రపతి రాక
ముచ్చింతల్‌లోని సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది... ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.

Samatamoorthy
President Ramnath Kovind : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.
Read More : IPL Auction 2022: ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ రికార్డ్.. కాసుల వర్షం కురిసింది
మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన… అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి వెళ్తారు. రెండుగంటల పాటు దివ్యక్షేత్రంలో గడపనున్న రాష్ట్రపతి.. శ్రీరామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు.. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 19 దివ్యదేశ ఆలయాలకు ప్రాణప్రతిష్ట చేయడంతోపాటు మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం చేయనునన్నారు. నేటి యాగంలో భాగంగా విశ్వక్సేన ఇష్టి, శ్రీమన్నారాయణ ఇష్టి, పెరుమాళ్‌కు పుష్పార్చన కార్యక్రమాలు జరగనున్నాయి.
Read More : Ambati Rambabu : ప్రత్యేక హోదా తొలగింపు వెనుక చంద్రబాబు-అంబటి రాంబాబు
శనివారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతా మూర్తి విగ్రహం తో పాటు 108 దివ్య దేశాలను వారు దర్శించుకున్నారు.
సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి
సాయంత్రం 3.30 గంటకు శ్రీరామనగరానికి రాష్ట్రపతి
20 నిమిషాల పాటు 108 దివ్య దేశాల సందర్శన
3.50 గంటలకు 120 కిలోల శ్రీరామానుజ స్వర్ణమూర్తి ఆవిష్కరణ
4.05 గంటలకు సమతామూర్తి దర్శనం
4.20 గంటలకు ఆడిటోరియం చేరుకోనున్న రాష్ట్రపతి
4.25 చిన్నజీయర్ స్వామి స్వాగత ఉపన్యాసం
సాయంత్రం 4.35 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
సాయంత్రం 4.50 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సత్కారం
సాయంత్రం 5.00 గంటలకు ఎయిర్ పోర్టు బయలుదేరనున్న రాష్ట్రపతి