kapileshwar swamy : మకర వాహనంపై దర్శన మిచ్చిన కపిల తీర్థ విభుడు

తిరుపతి  కపిల తీర్థంలోని  శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్త

kapileshwar swamy : మకర వాహనంపై దర్శన మిచ్చిన కపిల తీర్థ విభుడు

kapila teertham

Updated On : February 25, 2022 / 4:27 PM IST

kapileshwar swamy :  తిరుపతి  కపిల తీర్థంలోని  శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.

ఈరోజు ఉదయం గం.9ల నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
Also Read : Tirumala Food Stalls : తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగింపు.. భవిష్యత్ కార్యాచరణపై వ్యాపారుల చర్చ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం,ఇతర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.