Tirupati : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

Tirupati : శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Tirumanjanam

Updated On : March 27, 2022 / 2:42 PM IST

Tirupati :  తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 29వ తేదీ సాయంత్రం గం.6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం గం.8 నుంచి గం.10 వరకు, రాత్రి గం.8 నుంచి గం.10 వరకు వాహనసేవలు జరుగుతాయి. ఆ వివరాలు

      తేదీ                                ఉదయం                                         రాత్రి

30-03-2022          ధ్వజారోహణం(వృష‌భ‌ ల‌గ్నం)            పెద్దశేష వాహనం
31-03-2022           చిన్నశేష వాహనం                                  హంస వాహనం
01-04-2022           సింహ వాహనం                                       ముత్యపుపందిరి వాహనం.
02-04-2022          కల్పవృక్ష వాహనం–ఉగాది ఆస్థానం –సర్వభూపాల వాహనం
03-04-2022          పల్లకీ ఉత్సవం                                         గరుడ వాహనం
04-04-2022          హనుమంత వాహనం                            వసంతోత్సవం/గజ వాహనం
05-04-2022           సూర్యప్రభ వాహనం                             చంద్రప్రభ వాహనం
06-04-2022           రథోత్సవం                                            అశ్వవాహనం
07-04-2022           చక్రస్నానం                                           ధ్వజావరోహణం నిర్వహిస్తారు.