Yadadri Temple : రేపే మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభూ దర్శనం

గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

Yadadri Temple : రేపే మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభూ దర్శనం

Yadadri (1)

Updated On : March 27, 2022 / 12:09 PM IST

Maha Kumbh Samprokshanam : యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యకర్మం ముగిసిన వెంటనే సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా ఆలయం మొత్తం పోలీస్ బలగాలను మోహరించారు. ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read More : Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో దర్శించుకునే వారి సంఖ్య 30 వేల నుంచి 50 వేల వరకు పెరిగే అవకాశముందన్నారు. అటు మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పూజలు, ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొటోకాల్ అరేంజ్‌మెంట్లు, అతిథుల విడిది, గదుల కేటాయింపు, నీరు, భోజన వసతి, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి వాటిపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More : Yadadri Temple : యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి అంకురార్పణ

21 నుంచి 28 వ‌ర‌కు పాంచ‌రాత్రాగ‌మ ప‌ద్ధతిలో ఉద్ఘాట‌న పూజ‌లు నిర్వహించ‌నున్నారు వేదపండితులు. బాలాల‌యంలో ఉద్ఘాట‌న పూజ‌ల నేప‌థ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవ‌లు నిలిపివేయ‌నున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఆలయం సుందరంగా ముస్తాబైంది. గర్భాలయం, ముఖమండపం నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయం దగ్గర విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దగ్గర గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపనున్నారు.