Statue Of Equality : 108 ఉత్సవ మూర్తులకు రేపే శాంతి కళ్యాణం.. అందరూ ఆహ్వానితులే
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...

Chinna
108 Divya Desam Kalyanotsavam : ముచ్చింతల్ కు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తున్నారు. ఇక్కడ కొలువైన 216 అడుగుల ఎత్తయిన రామానుజచార్యుల పంచలోహ విగ్రహాన్ని చూసేందుకు.. వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం ప్రతి రోజు సందడి సందడిగా మారుతోంది. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ సోమవారం యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతితో మహా క్రతువు ముగిసింది. కానీ.. అప్పటికే దశల వారీగా 108 దివ్య దేశాల్లో ఉన్న మూర్తులకు ప్రాణప్రతిష్ట జరిగింది. కానీ.. శాంతి కళ్యాణం నిర్వహించలేదు. మహా పూర్ణాహుతి అనంతరం శాంతి కళ్యాణం నిర్వహంచాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
Read More : Samatha Murthi : ముచ్చింతల్‌కు పోటెత్తుతున్న ప్రజలు.. వెల్లివెరుస్తున్న ఆధ్మాత్మిక వాతావరణం
2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా…శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. శనివారం శాంతి కళ్యాణం జరుగనుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. 108 దివ్య దేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కళ్యాణం జరుగుతుందని, సాయంత్రం 5 నుంచి 8 గంటలకు వరకు జరుగుతుందన్నారు. సీఎంతో విబేధాలపై వస్తున్న దానికి ఆయన స్పందించారు. ఆయనతో తనకు విబేధాలు ఎందుకుంటాయని, ఆయన సహకారం ఉన్నందునే ఈ మహోత్తర కార్యక్రమం జరిగిందన్నారు. అందరూ సమతామూర్తిని దర్శించాలని, తమకు అందరూ సమానమేనని చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఎంట్రీ ఫీజు విషయంలో త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామన్నారు.
Read More : ChinnaJeeyar : ప్రధాని మోదీకి చిన్నజీయర్ ఆహ్వానం..ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహ ఆవిష్కరణ
శ్రీ రామానుజ సువర్ణ మూర్తితో పాటు 108 దివ్య దేశాల్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ..ఇతరత్రా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. శాంతి కల్యాణం పేరుతో జరగబోయే.. గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం.. భగవద్రామానుజుల వెయ్యేళ్ల పండుగలో మరో కీలక ఘట్టం. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో.. రామానుజాచార్యుల బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.