Muchintal : రేపే 108 ఉత్సవ మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం
యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...

Samata
Muchintal Statue of Equality : సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం అత్యద్భుతంగా జరుగుతోంది. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. రుత్విజుల ఆధ్వర్యంలో యాగశాలల్లో వేదపారాయణం శాస్త్రోక్తంగా సాగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది.
Read More : Sri Chinna Jeeyar Swamy : అంగరంగ వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. నేటి కార్యక్రమాలు
తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళుతున్నాయి. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా 2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు.
Read More : ISRO : PSLV సీ52 రాకెట్ కౌంట్ డౌన్ స్టార్ట్, రేపే ప్రయోగం
ఇక శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు అత్యంత కీలకమైన క్రతువు 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం జరుగనుంది. సోమవారం సాయంత్రం చాలా విలక్షమైన కార్యక్రమమని, 108 దివ్యక్షేత్రాల్లో ఉన్న భగవన్ మూర్తులకు అందరికీ కలిపి ఒకేసారి శాంతి కళ్యాణం జరుగుతుందని చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఇలాంటి కార్యక్రమం చరిత్రలో జరగలేదని, జరిగిన ఆధారాలు లేవన్నారు. ఆఖరి రోజైన 14వ తేదిన.. మహా పూర్ణాహుతి ఉంటుంది. ఇప్పటికే 108 దివ్యదేశాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు.
Read More : IPL Auction 2022: CSK నుంచి LSG వరకు.. మొదటి రోజు వేలం తర్వాత జట్లు ఇవే!
వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు. ఈ కార్యక్రమంతో.. కుంభ ప్రోక్షణ పూర్తై.. ఆ రోజు నుంచి ఆలయాలన్నీ.. ప్రాణ ప్రతిష్ఠ అవుతాయి. శాంతి కల్యాణం పేరుతో జరగబోయే.. గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం.. భగవద్రామానుజుల వెయ్యేళ్ల పండుగలో మరో కీలక ఘట్టం. 108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో.. రామానుజాచార్యుల బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.