Sabarimala Ayyappa Temple : తెరుచుకున్న శబరిమల ఆలయం-నిబంధనలతో భక్తులకు అనుమతి

కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్‌ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు.

Sabarimala Ayyappa Temple : తెరుచుకున్న శబరిమల ఆలయం-నిబంధనలతో భక్తులకు అనుమతి

Sabarimala Ayyappa Temple

Updated On : July 17, 2021 / 5:21 PM IST

Sabarimala Ayyappa Temple : కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్‌ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు. ఈరోజు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. కోవిడ్ నేపధ్యంలో ముందుగానే బుక్ చేసుకున్న 5వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.

ఈనెల 21 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. శబరిమల వచ్చేందుకు  అనుమతి ఉన్న యాత్రికులు కోవిడ్ టీకా రెండు డోసులు వేసుకుని ఉండాలని..ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్ధానం బోర్డు తెలిపింది. దర్శనానికి వచ్చే 48 గంటల నుంచి 72 గంటల ముందు చేయించుకున్న నెగెటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.