Shirdi, Sai Baba Temple Shut : షిర్డి సాయిబాబా ఆలయం మూసివేత

Shirdi Saibab Temple Closed
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్ని నిర్ణయించారు.
ముంబైలోని సిధ్ధివినాయక ఆలయాన్ని కూడా మూసి వేయనున్నారు. షిర్డి లో సాయిబాబా ఆలయంతోపాటు యాత్రికుల వసతి గృహాలు, ప్రసాదాల కౌంటర్లు అన్నీ మూసివేయబడతాయని ట్రస్ట్ తెలిపింది. భక్తులకు ఆలయంలోకి అనుమతి లేకపోయినా బాబావారికి జరిగే నిత్యపూజలు ఏకాంతంగా పూజారులు నిర్వహిస్తారు.
షిర్డి సాయి సంస్ధాన్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే కోవిడ్ ఆస్పత్రి పని చేస్తూనే ఉంటుందని తెలిపారు. కోవిడ్ కేసుల నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తోంది. వారాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం కోవిడ్ నివారణ చర్యలు చేపట్టిన తర్వాత షిర్డి సాయిబాబా సంస్ధాన్ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.