Sabarimala Temple : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..
మకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు.

Sabarimala Temple : అయ్యప్ప భక్తులతో శబరిమల నిండిపోయింది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు అయ్యప్ప దీక్షధారులు, భక్తులు ఎదురు చూస్తున్నారు. జ్యోతి దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు ట్రావెన్ కోర్ దేవస్థానం సభ్యులు. దాదాపు లక్షన్నర మంది జ్యోతి దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సన్నిధానం సమీపంతో పాటు జ్యోతిని దర్శించుకునేందుకు 40 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశారు.
మకర జ్యోతి, అయ్యప్ప దర్శనం అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భక్తులు కొండ దిగేలా ఏర్పాట్లు జరిగాయి. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించారు ట్రావెన్ కోర్ దేవస్థానం సభ్యులు. ఉదయం 10 గంటలకు పంబ నది నుంచి సన్నిధానం ప్రవేశాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న పూజ అనంతరం సన్నిధానానికి వెళ్లే 18 మెట్ల మార్గాన్ని మూసివేశారు అధికారులు.
Also Read : వామ్మో.. 365 రకాల వంటకాలతో విందుభోజనం.. కొత్త అల్లుళ్లకు అత్తింటి వారి అదిరిపోయే ఆతిధ్యం..
సాయంత్రం దీపారాధన, మకర జ్యోతి దర్శనం అనంతరం మళ్లీ పవిత్రమైన 18 మెట్ల మార్గం గుండా అనుతిస్తారు. మకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు. ఇక, సాయంత్రం గడ్డి మైదానం నుంచి యాత్రికులను ఆలయంలోకి అనుమతించబోమని ఇప్పటికే ప్రకటించారు. వన్యప్రాణి కారిడార్ లలో రాత్రి ప్రయాణాన్ని నిషేధించారు.
శబరిగిరుల్లో వివిధ ప్రాంతాల్లో మకర జ్యోతి దర్శనం చేసుకున్న భక్తులు.. రాత్రికి సత్రానికి చేరుకోవాలని సూచించారు. వారికి రేపు ఉదయం సన్నిధానానికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అలాగే మకర జ్యోతిని దర్శించుకునేందుకు శబరిమల ఆలయం కొండ మొత్తం కలిసి దాదాపు వెయ్యి ప్రాంతాల్లో ఏర్పాట్లు జరిగాయి.
Also Read : మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం