Statute Of Equality : అంకురార్పణతో ప్రారంభంకానున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
భగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.

Statue of Equality
Statute Of Equality : భగవంతుడు అందరివాడని… కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి. బుధవారం సాయంత్రం జరిగే అంకురార్పణతో ఈకార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి ఈ ఉదయం సాకేత రాముడు.. శ్రీరామచంద్రుడి శోభాయాత్ర ఊరేగింపుగా యాగశాలకు తరలి వచ్చింది.
త్రిదండి శ్రీమన్నారాయణ చినజియ్యర్ స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వాములు ఊరేగింపుగా స్వామి వారిని యాగశాలకు తీసుకు వచ్చారు. వారికి ముందు వేలాది మంది భక్తులు కోలాటాలు, భజనలతో… భగవన్నామస్మరణతో అశ్వారూఢుడైన శ్రీరామచంద్రుని యాగశాలకు తీసుకు వచ్చారు.
Also Read : Statue Of Equality : “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం.. శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ
ఈరోజు జరిగే విష్వక్సేన పూజ, పుణ్యావహాచనం తర్వాత వాస్తు హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే 12 రోజుల పాటు ఎటువంటి విఘ్నాలు అవాంతరాలు జరగకుండా ఉండేందుకు..విశ్వశాంతి కోసం సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం యాగశాలలో నిర్వహిస్తున్నారు.