TTD : ఆకాశవాణిలో టీటీడీ సుప్రభాతం, ఇతర సేవలు వినిపించవు!

ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.

TTD : ఆకాశవాణిలో టీటీడీ సుప్రభాతం, ఇతర సేవలు వినిపించవు!

Radio

Updated On : November 25, 2021 / 7:30 PM IST

Srivari Suprabhatam : ఆకాశవాణిలో ఇక నుంచి తిరుమల శ్రీవారి సుప్రభాతం, ఇతర సేవలు వినిపించవు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్వీబీసీ (SVBC) రేడియో, ఎస్వీఎఫ్ఎం (SVFM) రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆకాశవాణి ద్వారా ఈ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకప్పుడు రేడియో కింగ్. ప్రతింట్లో ఇది ఉండేది. ఇంటర్నెట్ లు లేన రోజుల్లో ప్రతి సమాచారం అందించడంలో రేడియో కీలక పాత్ర పోషించేది.

Read More : Anna Hazare : అన్నా హజారేకు అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు

వివిధ రకాల ఛానల్స్, న్యూస్ తదితర వ్యవస్థలు లేకపోవడం వల్ల…రేడియోకు ఫుల్ డిమాండ్ ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆకాశవాణితో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమలైంది. ప్రతిరోజు ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే…సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.

Read More : Anna Hazare : అన్నా హజారేకు అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు

ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో టీటీడీ కూడా సొంత ఛానల్, ఎఫ్ఎం రేడియో అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆకాశవాణిలో ఈ ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని టీటీడీ వెల్లడించింది. టీటీడీ ఎఫ్ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన ఇతర సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని..భక్తులు ఈ విషయాన్ని గుర్తించి…సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినాలని కోరడం జరుగుతోందని తెలిపింది.