Statue Of Equality : రామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు హాజరుకానున్న వీవీఐపీలు
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.

Statue Of Equality
Statue Of Equality : హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ‘సమానత్వం విగ్రహం’ గా పిలవబడే శ్రీరామానుజాచార్య 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆవిష్కరించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో చిన్నజీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు
కాగా, శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు. ఫిబ్రవరి 7న ఏపీ సీఎం జగన్ వేడుకల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తారు. ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముచ్చింతల్ రానున్నారు. ఫిబ్రవరి 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతా స్ఫూర్తి కేంద్రానికి రానున్నారు.
కాగా, నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టు వస్త్రాల్లో ప్రధాని మోదీ సమతామూర్తి సహస్రాబ్ది సమారోహంలో పాల్గొన్నారు. రుత్వికులు ప్రధాని మోదీతో సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని ప్రధాని ధరించారు. యాగశాలలో మోదీ ప్రత్యేక పూజలు చేసి విష్వక్సేన ఇష్టి యాగంలో పాల్గొన్నారు. భగవద్ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ లోకానికి అర్పితం చేశారు.
శ్రీరామనగరంలో ప్రతిష్టించిన సమతామూర్తి మంగళ రూపం.. ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. కాగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని గతేడాది అక్టోబర్ 31న ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇదే కావడం విశేషం. దీని ఎత్తు 182 మీటర్లు. కాగా ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం కానుంది. థాయ్ లాండ్‌లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.
WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!
ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సకల జనులకు అందించిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవద్రామానులు. కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన 11వ శతాబ్దానికి చెందిన అధ్యాత్మిక వైష్ణవ యోగి శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలు జరుగుతున్నాయి.