Navaratri 2024: నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ, వెల్లుల్లిని మాత్రం నవరాత్రులు వంటి పర్వదినాల్లో తినకూడదని చెబుతారు. అందుకు కారణం ఏంటి? చదవండి.

Navaratri 2024
Navaratri 2024: నవరాత్రుల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు అంటారు. అంటారు సరే.. ఎందుకు? అనే దానికి చాలామంది దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. కారణం ఏంటో చదవండి.
భారతీయ వంటకాల్లో ఖచ్చితంగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడతారు. నిజానికి వీటిని వాడటం వల్లే వంటకు రుచి వస్తుంది. అంతేకాదు ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఉపవాస సమయాల్లో ఈ రెండు పదార్ధాలను ఎట్టి పరిస్థితుల్లో తినరు. అందుకు బలమైన కారణాలు ఉన్నాయి.
ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం ఉన్న సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఉపవాస సమయంలో ఇంద్రియాలు ఆధీనంలో ఉండాలి. మనసు ఏకాగ్రతతో ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిలోని లక్షణాల కారణంగా మనసు అదుపు తప్పుతుంది. విలాసాలు, ఆనందాల వైపు మళ్లుతుంది. అందుకే నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని చెబుతారు.
దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. విష్ణువు మహా సముద్రాన్ని మథిస్తుంటే దేవతలకు అమృతం దక్కుతుంది. అయితే వారి మధ్యలో కూర్చుని స్వరభాను అనే రాక్షసుడు అమృతాన్ని, తేనెను సేవించాడు. ఈ విషయం తెలిసిన విష్ణువు అతని మొండెం, తల వేరు చేశాడు. అప్పటి నుంచి అతని తలను రాహు అని.. మొండెంను కేతు అని పిలుస్తున్నారు.
రాక్షసుడి మొండెం నుంచి తలను వేరు చేసే సమయంలో రెండు చుక్కల తేనె భూమిపై పడిందట. దాని నుండే ఉల్లిపాయ, వెల్లుల్లి పుట్టుకొచ్చాయట. అలా భూమిపైకి వచ్చిన ఈ రెండు గుండె ఆరోగ్యానికి మంచివని చెబుతారు. అంతేకాదు అవి రాక్షసుల వల్ల వచ్చాయి కాబట్టి పూజా సమయంలో వాటిని దూరం పెడతారట. అందుకే నవరాత్రుల్లో వీటిని తినకూడదు అని చెబుతారు.
Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు