Nandyala : ఆదివారం ఆ ఊళ్లో మాంసం తినరు.. మందు తాగరు..ఎందుకంటే?
ఆ గ్రామంలో ఆదివారం నాడు మాంసం ముక్క ముట్టరు. ఒకటి కాదు రెండు కాదు 300 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం అది. కారణం ఏంటి?

Nandyala
Nandyala : సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వస్తే పండగ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ తింటారు. కానీ ఆ ఊళ్లో ఆదివారం ఆదివారం ముక్క తినరు..మందు ముట్టరు.. ఇది అక్కడి ఆచారం. అందుకు కారణమేంటో చదవండి.
Ayodhya: ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా.. కొత్తరూపు సంతరించుకుంటున్న అయోధ్య నగరం
నాన్ వెజిటేరియన్స్ కార్తీకమాసంలోనో.. ఆలయానికి వెళ్లిన సందర్భాల్లోనో..ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసిన సమయాల్లో నాన్ వెజ్ తినరు. ఆదివారం ప్రత్యేకంగా నాన్ వెజ్ ఖచ్చితంగా తినేవారు ఉంటారు. అయితే నంద్యాల ఎస్.కొత్తూరు గ్రామంలో మాత్రం ఒక ఆచారం ఉంది. ఈ ఊర్లో సుబ్బారాయుడి ఆలయం వెలసిన దగ్గరనుండి అంటే 300 సంవత్సరాల నుండి గ్రామస్తులు ఆదివారం నాడు మాంసం తినరు. మందు తాగరు. గ్రామస్తులు ఈ ఆచారం పాటించడం వెనుక కారణం ఉంది.
300 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అంధుడైన చెన్నారెడ్డి అనే రైతు పొలం తవ్వుతుంటే 12 తలలతో ఉన్న నాగేంద్రుని విగ్రహం బయటపడిందట. అదే సమయంలో ఆ దారిన పోతున్న బ్రాహ్మణుడు మూడురోజుల పాటు ఆ విగ్రహానికి అభిషేకం చేస్తే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుందని చెప్పాడట. బ్రాహ్మణుడు చెప్పినట్లు గ్రామస్తులు ఆచరించేసరికి రైతు చెన్నారెడ్డికి కంటిచూపు వచ్చిందట. దీంతో గ్రామస్తులంతా నాగేంద్రుడికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో నాగేంద్రుడు కలలోకి వచ్చి ఆలయ నిర్మాణాన్ని రాత్రి మొదలుపెట్టి కోడికూతకు ముందు పూర్తి చేయాలని చెప్పారట. కానీ వారెంత కష్టపడ్డా గర్భగుడి గోడ మాత్రమే కట్టగలిగారట. అలా వెలసిని స్వామి కొత్తూరు సుబ్బారాయుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు.
TTD LAC in Delhi : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే
స్వామివారికి ఆదివారం ప్రీతికరమైనదిగా భావించే ఆ ఊరి గ్రామస్తులు ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆరోజు ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. మంగళవారాల్లో రాహుకాలంలో అభిషేకాలు నిర్వహిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఉద్యోగం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్నావారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుంటారు. అయితే ఈ ఆలయ నిర్మాణం సమయం నుండి ఇక్కడి గ్రామస్తులు ఆదివారం నాడు ఒక ఆచారం పెట్టుకున్నారు. ఆరోజు మాంసం తినకూడదని, మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దానిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 220 కుటుంబాలు, వెయ్యిమంది జనాభా నివాసం ఉంటున్నారు.