Thiruvannamalai Girivalam : పౌర్ణమికి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు అనుమతి ఇచ్చిన కలెక్టర్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై లో ఈనెలలో జరిగే పౌర్ణమి గిరి ప్రదక్షిణకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం విధించటంతో భక్తులు నిరాశకు లోనయ్యారు.

Thiruvannamalai Girivalam : పౌర్ణమికి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు అనుమతి ఇచ్చిన కలెక్టర్

Thiruvannamalai

Updated On : March 15, 2022 / 1:28 PM IST

Thiruvannamalai Giri Valam :  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై లో ఈనెలలో జరిగే పౌర్ణమి గిరి ప్రదక్షిణకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం విధించటంతో భక్తులు నిరాశకు లోనయ్యారు.

కోవిడ్ పరిస్ధితులు అదుపులోకి రావటంతో భక్తులు అందరూ మాస్క్ లు ధరించి, అవసరమైనంత భౌతిక దూరం పాటిస్తూ… శానిటైజర్ ఉపయోగిస్తూ మార్చి నెలలో పౌర్ణమి రోజుల్లో  గిరిప్రదక్షిణ చేసుకోవచ్చని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ మురుగేష్ అనుమతి ఇచ్చారు.

తిరువణ్ణామలై కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతినెల పౌర్ణమికి తమిళనాడు నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొండకు ప్రదక్షిణ చేస్తారు.మార్చి నెలలో భక్తులు 17,18 వ తేదీల్లో ఉన్న పౌర్ణమి పుణ్యదినాన అరుణాచలం చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు.

Also Read : Bank Robbery : గ్రాండ్‌గా పెళ్ళి చేసుకోటానికి బ్యాంకుకే కన్నం వేసిన ఘనుడు