TTD Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన టీటీడీ

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.

TTD Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన టీటీడీ

Ttd Increased Sarva Darshanam Tickets

Updated On : September 20, 2021 / 9:09 AM IST

TTD Sarva Darshanam :  తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన  భాగ్యం ఇకపై అందరికీ కలగిస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను జారీ చేస్తోంది.

ఇకనుంచి వాటి సంఖ్యను 8 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాక, అన్ని ప్రాంతాల వారికి దర్శనానికి అవకాశం కల్పించింది. పెరటాసి నెలకావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం టోకెన్ల్ తీసుకునే భక్తలు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి. ఏ రోజు టికెట్లను ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read : సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాలని స్టాలిన్‌కు ఆహ్వానం