Gita Recitation Competitions : టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు
యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు.

Ttd Bhagavadgita
Gita Recitation Competitions : యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబరు 5వ తేదీన భగవద్గీత 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగం) లో 6, 7వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు జూనియర్ విభాగంగాను, 8, 9వ తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు సీనియర్ విభాగంగాను తెలుగు రాష్ట్రాల్లోని ఆయా జిల్లా కేంద్రాలతో పాటు కేరళ, కర్ణాటక, చెన్నై ప్రాంతాల్లో జిల్లాస్థాయి కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు.
Also Read : Donate : ఆసమయంలో అప్పులు ఇస్తే తిప్పలు తప్పవా?…
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబరు 14వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలకు డిసెంబరు 29న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి 30వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు.
అలాగే భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన 18 సంవత్సరాల లోపు వారికి జూనియర్స్‌గాను, అంతకు పైబడిన వారికి సీనియర్స్ విభాగంగాను పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తిగలవారు నవంబరు నెలాఖరులోగా జిల్లా కేంద్రాల్లోని టిటిడి కల్యాణ మండపాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9618640444 నంబరుకు సంప్రదించాలని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి తెలియచేశారు.