Tiruchanur Temple : తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

Tiruchanur Temple : తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

Sravanamasam

Updated On : August 20, 2021 / 6:33 AM IST

Varalakshmi Vratham : శ్రావణమాసం..ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మీ రూపంలో కొలుచుకుంటుంటారు. కులాలకు అతీతంగా..ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా…చేసుకొనే ఈ వ్రతంతో ప్రసన్నులవుతారని నమ్మకం. పలు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వ్రతానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

Read More :Annie : ఐదుగురు మహిళా ఒలింపిక్ అథ్లెట్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఈ పీటీ టీచరే 

ఉత్సవమూర్తిని కొలువుదీర్చే..ముఖ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 2021, ఆగస్టు 20వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విధానం ద్వారా…భక్తులకు పాల్గొనే అవకాశం కల్పించింది టీటీడీ. వ్రతం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు పోస్టల్ ద్వారా ఉత్తీరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా అందచేయనున్నారు.

Read More : Cheruvaina Dooramaina: హీరోగానే చెయ్యాలని చిన్న క్యారెక్టర్లు వచ్చినా చేయలేదు

-వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైందని పురాణాలు చెబుతున్నాయి. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ప్రధానంగా..వివాహమైన మహిళలు ఆ వ్రతాన్ని నిర్వహిస్తారు. వ్రతం నిర్వహించి..పూజలు చేస్తే..అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.