బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం..

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు.

బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం..

India Beats Bangladesh (Photo Credit : Google)

Updated On : October 6, 2024 / 10:45 PM IST

Ind Vs Ban : బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బంగ్లాపై ఘన విజయం సాధించింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు రాణించారు. ఆల్ రౌండ్ షోతో టీమిండియా బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 128 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. మరో 49 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేజ్ చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్ (29), అభిషేక్ శర్మ (16), నితీశ్ కుమార్ రెడ్డి (16) పరుగులు చేశారు.

చివర్లో హార్ధిక్ పాండ్యా బ్యాట్ తో శివాలెత్తాడు. 16 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. దీంతో భారత్ బంగ్లాపై ఈజీ విక్టరీ నమోదు చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఇక, 3 టీ20 మ్యాచుల సిరీస్ లో భారత జట్టు 1-0 తేడాతో లీడ్ లో ఉంది.

Also Read : రోహిత్, ధోనీలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. శివమ్ దూబె ఏం చెప్పాడో తెలుసా.. వీడియో వైరల్