Abhishek Sharma : మోడల్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు.

Abhishek Sharma Under Police Radar After Model Dies By Suicide
Abhishek Sharma – Tanya Singh : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. మోడల్ తాన్యా సింగ్ ఆత్మహత్య కేసులో అతడిని పోలీసులు విచారణకు పిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూరత్‌లోని తన నివాసంలో మంగళవారం తాన్యా సింగ్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణించి రెండు రోజులు గడిచినా కూడా ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది అన్న సంగతి తెలియరాలేదు.
తాన్యాసింగ్ కాల్ రికార్డులను పరిశీలించగా చివరి సారిగా ఆమె అభిషేక్‌కు కాల్, మెసేజ్ చేసినట్లు కనుగొన్నారు. అయితే.. ఆ రెండింటికి అభిషేక్ స్పందించలేదు. కాగా.. తాన్యాసింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ ల మధ్య స్నేహం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బుధవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీఆర్ మల్హోత్రా తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదన్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని విలేకరుల సమావేశంలో చెప్పారు.
Rohit Sharma : రాంచీ టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
కాగా.. ఇప్పటి వరకు పోలీసులు అభిషేక్ శర్మను సంప్రదించలేదు. అయితే.. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అతడికి నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. అభిషేక్ శర్మ ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. సోషల్ మీడియాలో సైతం ఆమె మెసేజ్‌లకు స్పందించడం లేదు.
28 ఏళ్ల తాన్యా సింగ్ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా పని చేస్తోంది. డీజే, మేకప్ ఆర్టిస్ట్‌గానూ ఆమెకు అనుభం ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది.
ఎవరీ అభిషేక్ శర్మ..?
పంజాబ్‌కు చెందిన 23ఏళ్ల అభిషేక్ శర్మ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో 47 మ్యాచులు ఆడాడు 137.38 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. 2022 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని రూ.6.5 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది.