India vs Australia 3rd Test: ఆస్ట్రేలియాకు ఊరట.. మూడో టెస్టుకు ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు ..
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి రానుండటం ఆ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశం.

All Rounder Cameron Green
ndia vs Australia 3rd Test: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుంది. రెండు టెస్టులు పూర్తికాగా.. ఆ రెండింటిలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా మార్చి1 నుంచి ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఆస్ట్రేలియా జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ పేలువ ప్రదర్శనతో ఓటమిని చవిచూసింది. భారత్ స్పిన్ బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. అయితే, మూడు, నాలుగు టెస్టుల్లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను డ్రా చేయాలని ఆ జట్టు ఆటగాళ్లు కృషి చేస్తున్నారు.
India vs England : చేతులేత్తిసిన టీమిండియా, ఇంగ్లండ్ ఘన విజయం
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి రానుండటం ఆ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశం. కామెరూన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో ప్రతిభను కనబర్చే సత్తాకలిగిన ఆటగాడు. టెస్టు సిరీస్‌లో భాగంగా ఆసీస్ జట్టుతో భారత్‌కు వచ్చినప్పటికీ.. వేలికి గాయం కారణంగా మొదటి, రెండు మ్యాచ్‌లలో కామెరాన్ ఆడలేకపోయాడు. ప్రస్తుతం అతను ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించాడు.
23ఏళ్ల కామెరాన్ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 35 సగటుతో 806 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 23 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 27 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.