వరల్డ్ కప్ జట్టులోకి అంబటి.. పంత్‌లు

వరల్డ్ కప్ జట్టులోకి అంబటి.. పంత్‌లు

Updated On : April 17, 2019 / 10:56 AM IST

ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్వారా జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 

వారిద్దరితో పాటు ఇంగ్లాండ్ గడ్డపై జరగనున్న వరల్డ్ కప్ టోర్నీలో నవదీప్ సైనీ కూడా స్టాండ్ బై ప్లేయర్‌గా జట్టుతో పాటు ప్రయాణిస్తాడని బీసీసీఐ అధికారి తెలిపారు. పంత్, రాయుడు, సైనీ వరుసగా ముగ్గురు స్టాండ్ బై ప్లేయర్లు అందుబాటులో ఉండడంతో ఎవరైనా గాయాలకు గురైతే ఆ స్థానంలో వీళ్లు ఆడతారని వివరించారు. 

అంతకంటే ముందు దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు జట్టుకు అసిస్టెంట్‌లుగా నెట్ బౌలింగ్‌లో భారత జట్టుకు సహకరిస్తారని తెలిపింది బీసీసీఐ.  నాలుగో స్థానానికి అంబటి రాయుడును తీసుకుంటారని భావిస్తే ఆ స్థానానికి మూడు రకాలుగా విజయ్ శంకర్ సరిపోతాడని రాయుడుని పక్కకు పెట్టేశారు. దినేశ్ కార్తీక్ కంటే రిషబ్ పంత్ కీపర్ గా అనుభవం తక్కువ అని ఓ కారణం చూపించారు. మరి 2రోజుల వ్యవధిలోనే స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులో పంత్.. రాయుడు పేర్లు ఉండటం ఆలోచించదగ్గ విషయమే.