Anushka Sharma : హ్యాపీ 6 మంత్స్, కూతురితో కోహ్లీ, అనుష్క
ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్ అంటున్నారు కోహ్లీ, అనుష్క దంపతులు. కూతురు వామికాతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వామికాను గుండెలపై ఆడిస్తూ..అనుష్క కనిపిస్తే..గారాలపట్టిని కోహ్లీ ముద్దు చేస్తూ కనిపించాడు.

Kohli
Anushka Sharma, Virat Kohli’s Daughter : ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్ అంటున్నారు కోహ్లీ, అనుష్క దంపతులు. కూతురు వామికాతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వామికాను గుండెలపై ఆడిస్తూ..అనుష్క కనిపిస్తే..గారాలపట్టిని కోహ్లీ ముద్దు చేస్తూ కనిపించాడు. అయితే..ఎక్కడా వామిక ముఖం కనబడకుండా..జాగ్రత్త పడడం విశేషం. వామిక జన్మించి 6 నెలల పూర్తయిన సందర్భంగా…అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు.
Read More : Bar Owner : బార్ లో మంత్రి ఫోటోకు పూజలు చేస్తున్న యజమాని..ఎందుకంటే..
పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియచేశారు. సోనం కపూర్, వాణీ కపూర్, కాజల్ అగర్వాల్, సానియా మీర్జాతో పాటు పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలిపారు. అయితే..వామికా ముఖం కనబడకపోయేసరికి పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా వామికాను చూపిస్తారని అనుకుంటే…ఇలా చేశారంటీ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయినా..మీ కూతురికి తమ ఆశీర్వాదాలు ఉంటాయంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు 2017లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021, జనవరి 11వ తేదీన పండంటి ఆడబిడ్డ జన్మించింది.
View this post on Instagram