AUS vs IND : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డు పై కన్నేసిన టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్..
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు పై కన్నేశాడు.

Australia vs India Test series Jasprit Bumrah eyes Kapil Dev elite record
AUS vs IND : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు పై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో 20 వికెట్లు గనుక బుమ్రా తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ పేరిట ఉంది.
ఆస్ట్రేలియా గడ్డ పై కపిల్ 11 మ్యాచుల్లో 51 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 7 మ్యాచుల్లో 32 వికెట్లు తీసి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, బిషన్ సింగ్ బేడీలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
Virat Kohli : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కోహ్లీ కన్ను..
ఆసీస్ గడ్డ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
కపిల్ దేవ్ – 51 వికెట్లు
అనిల్ కుంబ్లే – 49 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 39 వికెట్లు
బిషన్ సింగ్ బేడీ – 35 వికెట్లు
జస్‌ప్రీత్ బుమ్రా – 32 వికెట్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఆసీస్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మొదటి టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతడు భారత్‌లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్టుకు బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. దీంతో ఆసీస్ గడ్డ పై బౌలర్‌గానే కాకుండా, కెప్టెన్‌గా బుమ్రా ఎలాంటి ముద్ర వేస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.