పాక్‌ను ఆశ్రయించిన బంగ్లా.. టీ20 ప్రపంచ కప్-2026లో మేమూ ఆడాలా? వద్దా? పాక్ పునరాలోచన?
బంగ్లాదేశ్ ఇష్యూను పరిష్కరించడానికి ఐసీసీ ప్రయత్నిస్తున్న సమయంలో మధ్యలో పాకిస్థాన్ తలదూర్చుతుండడం గమనార్హం.
PCB, Bangladesh Team (Image Credit To Original Source)
- పాకిస్థాన్ అధికారులతో మాట్లాడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
- బంగ్లాదేశ్ ఆడే విషయంపై మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన పాకిస్థాన్!
T20 World Cup Row: ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026లో ఆడాలా? వద్దా? అన్న విషయంలో పాకిస్థాన్ పునరాలోచనలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలరీత్యా భారత్‌లో మ్యాచులు ఆడబోమని, తాము ఆడాల్సిన మ్యాచులను వేరే దేశంలోని స్టేడియాలకు మార్చాలని బంగ్లాదేశ్ అంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మద్దతు తెలిపాలని పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
“పాకిస్థాన్ అధికారులతో బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట్లాడింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026లో బంగ్లాదేశ్ ఆడే విషయంపై మద్దతు ఇవ్వాలని కోరింది. పాక్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. బంగ్లాదేశ్ ఇష్యూకి పరిష్కారం దొరకకపోతే పాకిస్థాన్ కూడా ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026లో ఆడాలా? వద్దా? అన్న విషయంపై పునరాలోచిస్తుందన్న సూచనను పాక్ అధికారులు మాకు ఇచ్చారు” అని బంగ్లాదేశ్‌లోని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మధ్యలో తలదూర్చుతున్న పాకిస్థాన్
బంగ్లాదేశ్ ఇష్యూను పరిష్కరించడానికి ఐసీసీ ప్రయత్నిస్తున్న సమయంలో మధ్యలో పాకిస్థాన్ తలదూర్చుతుండడం గమనార్హం. టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువులపై దాడులు జరిగిన నేపథ్యంలో బంగ్లా-భారత్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.
Also Read: ఈ ట్రైన్లలో ఆర్‌ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్ స్లీపర్ క్లాస్.. చార్జీలు ఎంతో తెలుసా?
బీసీసీఐ సలహాతో ఇప్పటికే ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను టీమ్ నుంచి విడుదల చేసింది. ఆ నిర్ణయం వివాదాన్ని మరింత పెంచింది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేస్తోంది.
శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించలేని పరిస్థితి వస్తే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించుకోవచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటోంది. ఈ విషయాన్ని పీసీబీ వర్గాలు చెప్పినట్లు Geo సూపర్ న్యూస్ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది.
