అనుకున్న‌దే జ‌రిగింది.. ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌కు షాక్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు వీరికే..

గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌లే నిజం అయ్యాయి.

అనుకున్న‌దే జ‌రిగింది.. ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌కు షాక్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు వీరికే..

BCCI Announce Central Contracts No place for Ishan and Iyer

Updated On : February 28, 2024 / 7:54 PM IST

BCCI Central Contracts : గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌లే నిజం అయ్యాయి. టీమ్ఇండియా ఆట‌గాళ్లు ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ లు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల‌ను కోల్పోయారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్ర‌క‌టించిన సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్ద‌రి పేర్లు లేవు. 2023-24 సీజన్ అంటే అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30 2024 వరకు వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్ర‌క‌టించింది

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న ఆట‌గాళ్లు వీరే..
ఏ ప్ల‌స్ గ్రేడ్ ..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

ఏ గ్రేడ్‌..
ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.

Ishan Kishan : రీ ఎంట్రీలో తుస్‌మ‌న్న ఇషాన్ కిష‌న్.. ఇంకా కోలుకోలేదా?

బి గ్రేడ్‌..
సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.

సి గ్రేడ్‌..
రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్ రజత్ పటీదార్.

వీళ్లే కాకుండా.. 2023-24 సీజన్ అంటే అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30 2024 మ‌ధ్య కాలంలో ఎవ‌రైన ఆట‌గాడు క‌నీసం 3 టెస్టులు లేదా 8 వ‌న్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారు నేరుగా గ్రేడ్ సిలో చేర్చ‌బ‌డ‌తారని బీసీసీఐ తెలిపింది. ఉదాహరణకు, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు టెస్టులు ఆడారు. వారు ఇంగ్లాండ్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆఖ‌రి టెస్టు మ్యాచ్ ఆడితే వారు ఆటోమేటిక్‌గా గ్రేడ్ సిలో చేర్చ‌బ‌డ‌తార‌ని చెప్పింది.

Also Read : రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి? ఆఖ‌రి టెస్టులో కెప్టెన్‌గా బుమ్రా?

ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాత్ కావేరప్ప ల‌కు సెలక్షన్ కమిటీ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌ల కింద చేర్చింది. ఇక సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న ఆట‌గాళ్లు అంద‌రూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో అథ్లెట్లందరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ మ‌రో మారు స్ప‌ష్టం చేసింది.