సచిన్, కోహ్లీ, గంగూలీ, రోహిత్ శర్మ, ద్రవిడ్, భజ్జీ తయారుచేసిన మాస్క్‌లు చూశారా..

సచిన్, కోహ్లీ, గంగూలీ, రోహిత్ శర్మ, ద్రవిడ్, భజ్జీ తయారుచేసిన మాస్క్‌లు చూశారా..

Updated On : April 18, 2020 / 12:16 PM IST

బీసీసీఐ స్పెషల్ వీడియో రెడీ చేసింది. టీమ్ మాస్క్ ఫోర్స్ పేరిట చేసిన ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లతో పాటు టాప్ క్రికెటర్లంతా పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ లు ధరించాలని చెప్పిన మోడీ సూచన మేరకు మాస్క్‌ల ప్రమోషన్ చేశారు మన క్రికెటర్లు. 

నేను ఇంట్లో ఉండి నా మాస్క్ తయారుచేసుకున్నానంటూ మాస్క్ లు చూపెడుతూ వీడియో తయారుచేశారు. మీరు మీ మాస్క్ రెడీ చేస్కోండి ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎలా తయారుచేయాలో తెలుసుకోవచ్చని అందులో చెప్పుకొచ్చారు. ‘ఇండియాలో భాగమవడం గొప్పదనంగా భావిస్తున్నాను. కానీ, ఇవాళ మనమే ఓ పెద్ద టీంను రెడీ చేయాలి. ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ అని కోహ్లీ అన్నాడు. 

సచిన్ టెండూల్కర్.. ‘కమాన్ ఇండియా మాస్కులు తయారుచేసి మాస్క్ ఫోర్స్ లో భాగం అవండి. దాంతో పాటు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించండి. అని చెప్పారు. వీడియోలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, స్మృతి మంధాన, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్ లు మాట్లాడి మాస్క్ లు ధరించడంలో ఇంపార్టెన్స్ చెబుతూ.. ప్రభుత్వంతో కలిసి పోరాడదామని చెప్పారు. 

మాస్క్ ఫోర్స్ లో భాగం కావడం చాలా ఈజీ. ఇంట్లో ఉండి మాస్కులు తయారుచేసుకోవచ్చు. నేను చేసినట్లు అని రోహిత్ శర్మ చూపించాడు. బీసీసీఐ రూ.51కోట్లను ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ ఫండ్స్ కు విరాళంగా ఇచ్చింది. చైనాలోని వూహాన్లో పురుడుపోసుకున్న వైరస్.. దేశవ్యాప్తంగా 500మంది ప్రాణాలు బలిగొంది.