BCCI రెస్పాన్స్: బంగ్లా గొడవలో మేం వేలు పెట్టం

మ్యాచ్ ఫీజులు సరిపోలేదు పెంచండి బాబూ అంటే పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. మరికొద్ది రోజుల్లోనే అగ్ర జట్టు టీమిండియాతో తలపడాల్సి ఉన్న సమయంలో ఈ సమ్మె యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిపై భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా స్పందించింది.
తనంతట తాను చెప్పేంత వరకూ ఇది బంగ్లాదేశ్‌కు అంతర్గత విషయమే. అప్పటి వరకూ ఈ విషయంలో మేం తలదూర్చం. కానీ, భారత పర్యటనకు రానున్న క్రమంలో ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కావడంతో స్టేడియంకు వచ్చేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి నిర్ణయం త్వరగా వెల్లడిస్తే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయనుకుంటున్నామని బీసీసీఐ అధికార ప్రతినిధి తెలిపారు.
ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజు రూ.35వేలు ఉండగా దానిని లక్ష రూపాయలకు పెంచాలని షకీబ్ అల్ హసన్ డిమాండ్ చేస్తున్నాడు. అంటే సంవత్సరానికి రూ.4లక్షల 20వేలు వస్తున్న ఆధాయాన్ని రూ.12లక్షలుగా పెంచాలని కోరుతున్నారు. భారత్‌లో గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీ క్రికెటర్ కోహ్లీకి సంవత్సరానికి బీసీసీఐ రూ.7కోట్లు ఇస్తుంది.