IPL Robot Dog : రోబో కుక్కకి ఆ పేరెలా పెడతారు? బీసీసీఐపై కోర్టుకెళ్లిన మ్యాగజైన్ కంపెనీ
బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ రోబోటిక్ డాగ్‌ను ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

Champak magazine moves delhi high court alleging trademark infringement
క్రికెట్‌లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిపోయింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చాలా ముందు ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ రోబోటిక్ డాగ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. చూడడానికి కుక్క ఆకారంలో ఉండే ఈ రోబోకు హైక్వాలిటీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఆటలోని వైవిధ్యమైన విషయాలను ప్రెజెంట్ చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇస్తోంది ఈ రోబో డాగ్.
ఇక ఈ రోబో డాగ్‌కు చంపక్ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు చంపక్ పేరు మీద కొత్త వివాదం తలెత్తింది. రోబో డాగ్‌కు చంపక్ అనే పేరును ఉపయోగించడం ట్రేడ్ మార్క్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ చంపక్ మ్యాగజైన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్.. ఈ 5 మైలురాళ్లు బ్రేక్ అయ్యే ఛాన్స్..
ఢిల్లీ ప్రెస్ పాత్ర ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ గత కొన్ని సంవత్సరాలుగా చంపక్ అనే కామిక్ మ్యాగజైన్ అందిస్తోంది. ఈ పత్రిక మరాఠీ, హిందీ, ఆంగ్ల బాషల్లో ప్రచురితమవుతుంది. బీసీసీఐ తన రోబో డాగ్‌కు చంపక్ అని పేరు పెట్టిన తరువాత ఢిల్లీ ప్రెస్ గ్రూప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీసీఐ ట్రేడ్ మార్క్ చట్టాన్ని ఉల్లంఘించిందని అందులో ఆరోపించింది.
కామిక్ మ్యాగజైన్ దాఖలు చేసిన మధ్యంతర ఇంజక్షన్ దరఖాస్తుపై జస్టిస్ సౌరభ్ బెనర్జీ నోటీసు జారీ చేసి, లిఖితపూర్వక ప్రతిస్పందనలను దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం ఇచ్చారు.
విచారణ సందర్భంగా.. రోబో డాగ్‌కు చంపక్ అని పేరు పెట్టడం వల్ల బీసీసీఐకి ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కలుగుతోంది? అని కోర్టు ప్రశ్నించింది. బీసీసీఐ వివిధ మాధ్యమాల్లో చంపక్‌ను ప్రచారం చేస్తోందని, దీని ద్వారా వారికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని పత్రికా తరుపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు ఆధారాలతో వాదించాలని, ఇంజక్షన్ జారీకి కేవలం మౌఖిక వాదనలు సరిపోవని కోర్టు పేర్కొంది.
KKR : గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతాకు బిగ్ షాక్.. కెప్టెన్ రహానేకు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?
View this post on Instagram
మరోవైపు.. చంపక్ అనే పదాన్ని ఎవరూ సృష్టించలేదని బీసీసీఐ న్యాయవాది సాయి దీపక్ అన్నారు. అది ఒక పువ్వు పేరు అని చెప్పారు. చంపక్ అనే పేరును కేవలం కామిక్ మ్యాగజైన్ మాత్రమే ఉపయోగించడం లేదని ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ సిరీస్‌లోనూ చంపక్ అనే పాత్ర ఉందని చెప్పారు. చంపక్ పేరును ఎంచుకునేటప్పుడు సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించినట్లుగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అభిమానులు ఇష్టపడడంతో రోబోకు ఈ పేరు పెట్టామన్నారు.
దీనిపై తదుపరి విచారణను జూలై 9కి న్యాయస్థానం వాయిదా వేసింది.