Chess World Cup 2023 Final : చెస్‌ వరల్డ్ కప్‌ విజేతగా మాగ్న‌స్ కార్ల్‌సన్‌.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ విజేత‌గా నార్వేకు చెందిన ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ (Magnus Carlsen) నిలిచాడు.

Chess World Cup 2023 Final : చెస్‌ వరల్డ్ కప్‌ విజేతగా మాగ్న‌స్ కార్ల్‌సన్‌.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

Magnus Carlsen wins maiden World Cup

Updated On : August 24, 2023 / 5:47 PM IST

Chess World Cup Final : ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ విజేత‌గా నార్వేకు చెందిన ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ (Magnus Carlsen) నిలిచాడు. భార‌త యువ సంచ‌ల‌నం, గ్రాండ్ మాస్ట‌ర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa) తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ట్రై బ్రేక్‌లో కార్ల్‌స‌న్ గెలుపొందాడు. ట్రై బ్రేక్‌లో భాగంగా హోరాహోరీ జ‌రిగిన తొలి రౌండ్ గేమ్‌లో క్లార్‌స‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించుకుంటూ విజ‌యం సాధించాడు. దీంతో రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Chess World Cup 2023 Final : చెస్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌.. రెండో గేమ్ కూడా డ్రా నే.. ఇక ట్రై బ్రేక్‌లోనే..

అయితే.. రెండో గేమ్‌లోనూ ప్ర‌జ్ఞానంద‌కు కార్ల్‌స‌న్ ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో మాగ్న‌స్ కార్ల్‌సన్ ప్రపంచ విజేత‌గా నిలిచాడు. విజేత‌గా నిలిచిన కార్ల్‌స‌న్‌కు రూ.91 ల‌క్ష‌లు, ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్ర‌జ్ఞానంద‌కు రూ.61 ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. కాగా.. మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌కు ఇదే తొలి వ‌ర‌ల్డ్ క‌ప్ కావ‌డం గ‌మ‌నార్హం.

Virat Kohli : యోయో టెస్టు పాస్‌.. పిక్ షేర్ చేసిన కోహ్లీ.. స్కోరెంతంటే..?