బాక్సింగ్ డే టెస్ట్ మనదే : భారత్ ఘన విజయం

అనుకున్నదే అయ్యింది. బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 137 రన్స్ తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 399 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 07:57 AM IST
బాక్సింగ్ డే టెస్ట్ మనదే : భారత్ ఘన విజయం

Updated On : December 30, 2018 / 7:57 AM IST

అనుకున్నదే అయ్యింది. బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 137 రన్స్ తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 399 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

మెల్‌బోర్న్: అనుకున్నదే అయ్యింది. బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 137 రన్స్ తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 399 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 5వ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఆసీస్ మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్లలో జడేజా, బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, షమీ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. టెస్టుల్లో టీమిండియాకు ఇది 150వ విజయం. ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు ఇది 7వ గెలుపు.