Suresh Raina : వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోనీ ఆడకుంటే.. నేనూ ఆడను..!
టీమిండియా మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే.. తాను కూడా ఆడనని రైనా స్పష్టం చేశాడు.

If Ms Dhoni Doesn’t Play Ipl Next Season
Suresh Raina : టీమిండియా మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే.. తాను కూడా ఆడనని రైనా స్పష్టం చేశాడు. తనలో మరో నాలుగైదు ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు. అయినప్పటికీ.. ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అయితే మాత్రం.. తాను కూడా ఆట నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ‘నాలుగు ఐదేళ్లు నేను క్రికెట్ ఆడగలను. ఈ ఏడాది ఐపీఎల్ ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు ఐపీఎల్‌లో చేరనున్నాయి. ఐపీఎల్ ఆడినంత కాలం చెన్నైకే ఆడతా’ అని రైనా చెప్పుకొచ్చాడు.
గత ఏడాది 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించిన తర్వాత సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ భయ్యా.. ఆడకపోతే మాత్రం.. తాను కూడా ఆ సీజన్ ఐపీఎల్ ఆడబోనని స్పష్టం చేశాడు. మేమిద్దరం 2008 నుంచి కలిసి ఆడుతున్నాము. ఐపీఎల్ 2021 సీజన్‌లో CSK గెలుపు అవకాశాలు ఉన్నాయని, ఇందులో గెలిస్తే.. మరో ఐపీఎల్ సీజన్‌లో కూడా ఎంఎస్ ధోనీని ఆడేందుకు ఒప్పించటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. రెండు జట్లు ఉన్నప్పటికీ CSK తరఫున ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇప్పటి నుంచి ఒక ఏడాది టీ20 లీగ్‌లో చేర్చుకోవాలని సురేష్ రైనా అన్నారు. వచ్చే సీజన్ లో రెండు కొత్త జట్లు వస్తాయి.. కానీ, తాను మాత్రం CSK జట్టులోనే కొనసాగుతానని చెప్పాడు. ఐపీఎల్ 2011, 2014, 2018 వేలంలో ముందు ఇద్దరు ఆటగాళ్లను CSK నిలబెట్టింది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. అతను ఐపీఎల్ 2021 సీజన్ లో మళ్లీ CSK జట్టులోకి తిరిగి వచ్చాడు. సెప్టెంబరులో ప్రారంభమయ్యే ఐపిఎల్ 2021 రెండవ దశ మ్యాచ్ కోసం సురేశ్ రైనా UAE వెళ్లనున్నాడు.