ఈ సీజన్‌లో కూడా డేవిడ్ వార్నర్@500

ఈ సీజన్‌లో కూడా డేవిడ్ వార్నర్@500

Updated On : April 21, 2019 / 2:49 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల యంత్రం.. జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లోనూ 500పరుగులు బాదేశాడు. తాను ఆడిన ప్రతి సీజన్‌లో 500పరుగుల కంటే ఎక్కువ సాధించే వార్నర్ ఈ సారి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 21 ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన కోల్‌కతా మ్యాచ్‌లో వార్నర్ (67; 38బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సులు) పరుగులు చేశాడు. 

29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌ ఈ సీజన్‌లో 500 పరుగుల మైలురాయిని దాటేశాడు. సీజన్ల వారీగా చూస్తే వార్నర్ కెరీర్లో 2014 నుంచి ఇలా ఉన్నాయి. 2014లో 528 పరుగులు, 2015లో 562పరుగులు, 2016లో 848పరుగులు, 2017లో 641పరుగులు, 2019లో 516పరుగులు అతని ఖాతాలో చేరాయి. 

వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. ఆస్ట్రేలియా జట్టు వార్నర్, స్మిత్‌లను ప్రాక్టీస్ నిమిత్తం తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏప్రిల్ 23న జరగాల్సి ఉన్న మ్యాచ్ అనంతరం వార్నర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే ఈ సీజన్‌కు వార్నర్ ఆడేది అదే ఆఖరి మ్యాచ్ అవుతుంది.