DCvsRCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 188

సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్‌ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)రెచ్చిపోవడంతో చివరి ఓవర్లలో స్కోరు పరుగులు పెట్టింది. అతనికి తోడుగా అక్సర్ పటేల్(16)చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ 2వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్లే ఆఫ్ బరిలో నిలవాలని తాపత్రయపడుతున్న ఢిల్లీ ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కనబరిచింది. ఓపెనర్లు పృథ్వీ షా(18), శిఖర్ ధావన్(50)తో శుభారంభాన్ని అందించారు.
ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(57; 37బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులు) జట్టుకు ఊతమివ్వడంతో ఢిల్లీకి చక్కటి స్కోరు లభించింది. రిషబ్ పంత్(7), కొలిన్ ఇన్‌గ్రామ్(11)తో 187 పరుగులు చేయగలిగారు.