Abhishek Sharma : ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా అభిషేక్ శర్మ ఎంత సంపాదించనున్నాడో తెలుసా?
అభిషేక్ శర్మ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్‌కు ఆడడం ద్వారా కోట్లలో సంపాదించనున్నాడు.

pic credit @ BCCI Twitter
ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీల మోత మోగించాడు. 54 బంతులను ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 7 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు అభిషేక్. ఇప్పటి వరకు 17 మ్యాచులు ఆడాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 33.4 సగటు 193.8 స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు రెండు అర్థశతకాలు ఉన్నాయి. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు శుభారంభాలను అందిస్తున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌తో జట్టులో అతడి స్థానం దాదాపుగా సుస్థిరం అయినట్లే. ఈ క్రమంలో అతడు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడడం దాదాపుగా ఖాయమైనట్లేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
For playing an impressive knock of 135(54) and bagging 2 wickets, Abhishek Sharma is the Player of the Match 👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ifhZsbi7mr
— BCCI (@BCCI) February 2, 2025
ఈ 24 ఏళ్ల ఆటగాడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019 నుంచి అతడు ఎస్ఆర్‌హెచ్‌కు ఆడుతున్నాడు. గత మూడు సీజన్లుగా నిలకడైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 ముందు మెగావేలాన్ని నిర్వహించగా.. ఎస్ఆర్‌హెచ్ అతడిని వేలానికి విడిచిపెట్టలేదు. రూ.14 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది. అంతకముందు వరకు అతడికి రూ.6.5 కోట్లను చెల్లించేది. అంతేకాదండోయ్ అతడిని 2022లో రిటైన్ చేసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 55.8 సగటుతో 219.69 స్ట్రైక్ రేటుతో 279 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. మరో నెల రోజు తరువాత జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో ఇదే ఫామ్‌ను అభిషేక్ శర్మ కంటిన్యూ చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు.