CSK vs RCB : గ‌త 17 ఏళ్లుగా చెపాక్‌లో చెన్నైపై గెల‌వ‌ని బెంగ‌ళూరు.. ఈ సారైనా విజ‌యం సాధించేనా? సీఎస్‌కే, ఆర్‌సీబీ హెడ్ టు హెడ్ రికార్డ్స్‌, పిచ్ రిపోర్టు..

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో శుక్ర‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల త‌ల‌ప‌డ‌నున్నాయి.

CSK vs RCB : గ‌త 17 ఏళ్లుగా చెపాక్‌లో చెన్నైపై గెల‌వ‌ని బెంగ‌ళూరు.. ఈ సారైనా విజ‌యం సాధించేనా?  సీఎస్‌కే, ఆర్‌సీబీ హెడ్ టు హెడ్ రికార్డ్స్‌, పిచ్ రిపోర్టు..

pic credit @ ANI

Updated On : March 28, 2025 / 3:15 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డ‌నున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే, చెన్నై జ‌ట్లు ఎన్ని సార్లు ముఖాముఖిగా త‌ల‌పడ్డాయి? ఆధిప‌త్యం ఎవ‌రిది అన్న‌ది ఓ సారి చూద్దాం..

ముఖాముఖిగా..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ను ఓడించి బెంగళూరు జోష్‌లో ఉండగా.. బలమైన ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించి చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది.

Nicholas Pooran : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 26 బంతుల్లో 70 ప‌రుగులు.. క్ష‌మించండి.. మ‌రోసారి ఈ త‌ప్పు చేయ‌నన్న నికోల‌స్ పూర‌న్‌..

ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బెంగ‌ళూరు, చెన్నై జ‌ట్లు ముఖాముఖిగా 33 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఎక్కువ‌గా చెన్నై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 21 మ్యాచ్‌ల్లో చెన్నై గెల‌వ‌గా, బెంగ‌ళూరు 11 మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు.

అప్పుడెప్పుడో ఆరంభ సీజ‌న్‌లో త‌ప్పిస్తే..

ఇప్ప‌టి వ‌ర‌కు 17 ఐపీఎల్ సీజ‌న్లు పూర్తి అయ్యాయి. ప్ర‌స్తు సీజ‌న్ 18వ సీజ‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నైలోని చిదంబ‌రం వేదిక‌గా చెన్నై, బెంగ‌ళూరు జ‌ట్లు 9 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ 2008లో మిన‌హా మిగిలిన అన్ని సంద‌ర్భాల్లో సీఎస్‌కే గెలిచింది.

Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ గురించి ఈ విష‌యం తెలుసా..? పంత్ లాగానే యాక్సిడెంట్‌.. ఆట‌ను వ‌దులుకోవాల‌ని డాక్ట‌ర్ల స‌ల‌హా.. మొండి ధైర్యంతో..

దీంతో శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో చెన్నై విజ‌యం సాధించి దాదాపు 17 ఏళ్లుగా అంద‌ని ద్రాక్ష‌లా ఉన్న విజ‌యాన్ని బెంగ‌ళూరు సొంతం చేసుకోవాల‌ని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.

చిదంబ‌రంలో చెన్నై రికార్ట్‌..

చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 51 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 30 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజ‌యం సాధించింది. మ‌రో 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

పిచ్ రిపోర్ట్‌..
సాధార‌ణంగా చెన్నైలోని చిదంబ‌రంలో స్టేడియంలోని పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలం. అదే స‌మ‌యంలో స్పిన్ ను చ‌క్క‌గా ఆడే ఆట‌గాళ్లు ప‌రుగులు రాబ‌ట్టొచ్చు. ఈ మైదానంలో 160-170 ప‌రుగులు చేసినా కాపాడుకోవ‌చ్చు.

రెండు జ‌ట్ల అంచ‌నా..

చెన్నై సూపర్ కింగ్స్‌..
ర‌చిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్

SRH vs LSG : స‌న్‌రైజ‌ర్స్ పై విజ‌యం.. మెట్లు దిగి వ‌చ్చి మ‌రీ పంత్‌ను గ‌ట్టిగా కౌగ‌లించుకున్న సంజీవ్ గొయెంకా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, యష్ దయాల్.