Fake Fielding : డికాక్‌ మాయ.. డబుల్ సెంచరీ చేయకుండా జమాన్‌‌ను ఎలా రనౌట్ చేశాడో చూడండి..

పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్ ‌(193; 155 బంతుల్లో 18ఫోర్లు, 10సిక్స్)ను రనౌట్‌ చేశాడు క్వింటన్ డికాక్.. ఏదోలా మాయ చేసి జమాన్‌ను 200 స్కోరు చేయనియకుండానే పెవిలియన్ పంపించాడు.

Fake Fielding : డికాక్‌ మాయ.. డబుల్ సెంచరీ చేయకుండా జమాన్‌‌ను ఎలా రనౌట్ చేశాడో చూడండి..

Fakhar Zaman Run Out On 193

Updated On : April 5, 2021 / 2:37 PM IST

fake fielding by Quinton de Kock : పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్ ‌(193; 155 బంతుల్లో 18ఫోర్లు, 10సిక్స్)ను రనౌట్‌ చేశాడు క్వింటన్ డికాక్.. ఏదోలా మాయ చేసి జమాన్‌ను 200 డబుల్ సెంచరీ చేయనియకుండానే పెవిలియన్ కు పంపించాడు. డికాక్ చీటింగ్ ట్రిక్ వివాదానికి దారితీసింది. ఎలా ఆడమనేది కాదు.. గెలిచామా లేదా అన్నట్టుగా ఫెయిర్ ఫ్లే నియమ నిబంధనలకు విరుద్ధంగా డికాక్ ప్రవర్తించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. డికాక్‌(80), వాండర్‌ డసెన్‌ (60), కెప్టెన్‌ బవుమా(92), మిల్లర్‌(50) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ జమాన్‌ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మిగతా ఆటగాళ్లు ఒకరితరువాత మరొకరు ఔట్ అయి పెవిలియన్ చేరుతున్నారు. కానీ, జమాన్ మాత్రం వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. జమాన్ వికెట్ ఎలాగైనా తీయాలన్న దురుద్దేశంతో డికాక్.. మాయ చేశాడు..

చివరి ఓవర్‌లో 31 పరుగులు చేయాల్సి ఉండగా.. జమాన్‌(192) పరుగులతో డబుల్ చేరువలో నిలిచాడు. ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్‌ రన్‌ తీయబోయిన జమాన్‌ రెండో పరుగు పూర్తి చేసే సమయంలో రనౌటయ్యాడు. ఫీల్డర్‌ మార్‌క్రమ్‌ డైరెక్ట్‌ విసరడంతో పెవిలియన్‌ చేరాడు. ఇక్కడే దక్షిణాఫ్రికా కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ మాయ చేశాడు. జమాన్‌ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా ఫీల్డర్‌ విసిరిన బంతి నాన్‌ స్ట్రైకర్‌ వైపు వెళ్తున్నట్లు సైగలు చేశాడు.

పాక్‌ బ్యాట్స్‌మన్‌ తిరిగి చూశాడు. ఈలోపే బంతి వికెట్లకు తాకడంతో రనౌటయ్యాడు. రీప్లేలో డికాక్‌ ఉద్దేశపూర్వకంగా జమాన్‌ను మాయ చేసినట్టే కనిపించింది. చివరికి పాక్‌ 50 ఓవర్లలో 324/9తో నిలిచింది. దక్షిణాఫ్రికా 17 పరుగులతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జమాన్‌ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.