Smriti Mandhana : ఎట్టకేలకు మౌనం వీడిన స్మృతి మంధాన.. నా పెళ్లి రద్దైంది..
భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి రద్దు అయినట్లు తెలిపింది.
Finally Smriti Mandhana breaks silence The wedding is off
Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23న జరగాల్సిన ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఈ విషయం పై మౌనంగా ఉన్న స్మృతి మంధాన ఎట్టకేలకు స్పందించింది. తన పెళ్లి రద్దు అయినట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని నేను. అలాగే ఉంచుతాను కూడా. అయితే.. నా పెళ్లి రద్దు అయింది. ఈ విషయాన్ని అందరికి స్పష్టంగా చెబుతున్నాను.’ అని మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
Team India : 2025లో వన్డేల్లో టీమ్ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా?

ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ సమయంలో రెండు కుటుంబాల గోపత్యను గౌరవించాలని, స్వతంత్రంగా ముందుకు సాగే స్పేస్ ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించింది.
‘వీలైనంత కాలం టీమ్ఇండియా తరుపున ఆడి మరిన్ని ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను. నా దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.’ అని స్మృతి మంధాన అంది.
