స్టన్నింగ్ డైవ్: పాండ్యా అద్బుత క్యాచ్‌

స్టన్నింగ్ డైవ్: పాండ్యా అద్బుత క్యాచ్‌

Updated On : January 28, 2019 / 9:14 AM IST

సస్పెన్షన్ పూర్తి అయిన వెంటనే జట్టులోకి పాండ్యాను ఎలా తీసుకున్నారని సందేహాలు మొదలైన కాసేపటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఫీల్డింగ్‌లో పాండ్యా తీరును అమితంగా ఇష్టపడే కోహ్లీకి మరోసారి తన ప్రదర్శనలో ఏ మార్పు లేదని చూపించాడు. మూడో వన్డేలో ఆడుతున్న పాండ్యా విలియమ్సన్ కొట్టిన భారీ షాట్‌కు గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. బంతిని చేజారనివ్వకుండా అద్భుతంగా ఒడిసిపట్టాడు. 

చాహల్ 17 ఓవర్లలో బౌలింగ్‌ చేస్తుండగా విలియమ్సన్ భారీ షాట్ కొట్టాడు. దానిని గాల్లోకి ఎగిరి మరీ అందుకోవడంతో కివీస్ కెప్టెన్ జోరుకు బ్రేక్ పడింది. టేలర్‌తో కలిసి ఆడుతున్న విలయమ్సన్‌‌ల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. పాండ్యా పట్టిన ఈ వండర్ క్యాచ్ హాట్ టాపిక్‌గా మారడంతో ‘ఏం పట్టాడురా’, ‘అద్భుతమైన క్యాచ్’ అంటూ నెటిజన్‌లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఆల్ రౌండర్‌ స్థానంలో జట్టుకు ఎంపికైన పాండ్యా 10ఓవర్ల పాటు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా 45 పరుగులకు కట్టడి చేశాడు.