MS dhoni-Hari Shankar Reddy : ధోనీని క్లీన్ బౌల్డ్ చేసిన మన తెలుగు బిడ్డ.. హరిశంకర్ రెడ్డి
మహేంద్ర సింగ్ ధోనీ అంటే అతడికి ఎంతో ఇష్టం.. అభిమాని.. యువ క్రికెటర్ కూడా.. ఇప్పుడు అతడు ధోనీ వికెట్ పడగొట్టాడు. అతడే మన తెలుగు బిడ్డ, కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి.

Ms Dhoni Hari Shankar Reddy
MS dhoni – Hari Shankar Reddy : మహేంద్ర సింగ్ ధోనీ అంటే అతడికి ఎంతో ఇష్టం.. అభిమాని.. యువ క్రికెటర్ కూడా.. ఇప్పుడు అతడు ధోనీ వికెట్ పడగొట్టాడు. అతడే మన తెలుగు బిడ్డ, కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. టైటిల్ సాధనే లక్ష్యంగా సీఎస్‌కే జట్టు ప్రాక్టీసు మొదలు పెట్టింది.
ధోనితో పాటు, టీమ్ ఆటగాళ్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీషన్, సాయి కిషోర్, హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్‌లో 22ఏళ్ల హరిశంకర్ అద్భుతమైన బౌలింగ్‌తో ధోనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hari Shankar Reddy taking Dhoni’s wicket during the practice#IPL2021 pic.twitter.com/zpEv8gHsp8
— Vinesh Prabhu (@vlp1994) March 17, 2021
హరిశంకర్ రెడ్డి వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరిశంకర్ రెడ్డి బంతి వేగం ధాటికి ధోని లెగ్ స్టంప్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ వీడియో చూసిన వారందరూ ప్రాక్టీస్‌లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.