Rajinikanth : గోల్డెన్‌ టికెట్ అందుకోవ‌డంపై స్పందించిన ర‌జినీకాంత్‌.. ఆ టికెట్ ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా..?

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవ‌డంపై సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

Rajinikanth : గోల్డెన్‌ టికెట్ అందుకోవ‌డంపై స్పందించిన ర‌జినీకాంత్‌.. ఆ టికెట్ ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా..?

Rajnikanth receive Golden Ticket

Updated On : September 20, 2023 / 3:34 PM IST

Rajnikanth receive Golden Ticket : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవ‌డంపై సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 టోర్నీ విజ‌యవంతం కావాల‌ని ఆకాంక్షించారు. బీసీసీఐకి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషాను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని, ఆప్యాయ‌త‌తో కూడిన మీ మాట‌లు, ఆలోచ‌న‌ల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ర‌జినీకాంత్ ట్వీట్ చేశారు.

గోల్డెన్ టికెట్ ప్ర‌త్యేక‌త ఏంటంటే..?

భార‌తదేశంలో అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీ నిర్వ‌హ‌ణ‌ను బీసీసీఐ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్ర‌మంలోనే క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ తీసుకువ‌చ్చేందుకు ‘గోల్డెన్ టికెట్ ఫ‌ర్ ఇండియా ఐకాన్స్’ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా భార‌త‌దేశంలో ప్ర‌ముఖుల‌కు గోల్డెన్ టికెట్‌ను అందిస్తోంది. మొద‌టి గోల్డెన్ టికెట్‌ను బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ఇవ్వ‌గా రెండో టికెట్‌ను క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌కు అంద‌జేశారు. మంగ‌వారం సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ను క‌లిసిన జై షా ఆయ‌న‌కు గోల్డెన్ టికెట్‌ను అంద‌జేశారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ర‌జినీకాంత్ దీనిపై స్పందించారు.

ICC World Cup 2023 : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్‌’

ఇక గోల్డెన్ టికెట్ క‌లిగిన వారు ప్ర‌పంచ‌క‌ప్‌లోని అన్ని మ్యాచుల‌ను వీఐపీ స్టాండ్ నుంచి ఉచితంగా చూడొచ్చు. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ‌మ‌య్యే లోపు మ‌రికొంత మందికి బీసీసీఐ గోల్డెన్ టికెట్‌ను ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ కోసం మొత్తం 10 జ‌ట్లు పోటీ ప‌డ‌నున్నాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో అక్టోబ‌ర్ 8న ఆడ‌నుంది.