ఓ పాక్.. భారత్ మాకు చెప్పే చేసింది: ఐసీసీ

ఓ పాక్.. భారత్ మాకు చెప్పే చేసింది: ఐసీసీ

Updated On : March 12, 2019 / 12:26 PM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా భారత్ రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగింది. గెలిస్తే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేస్తామంటూ ముందుగానే మాటిచ్చింది. 
Read Also : IPLలో టాప్ 5గా నిలిచిన ప్లేయర్లు ఎవరంటే..

ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ప్రవర్తించిన తీరు ఐసీసీ నియమాలకు విరుద్ధంగా ఉందని వెంటనే బీసీసీఐపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని పీసీబీ ఫిర్యాదు చేసింది. వాటికి ధీటుగా కౌంటర్ ఇచ్చిన ఐసీసీ.. టీమిండియా ఆర్మీ క్యాప్‌లు ధరించే సంగతి మాకు ముందుగానే చెప్పిందని ఐసీసీ తెలిపింది. 

ఫిబ్రవరి నెలలోనే బీసీసీఐ.. పుల్వామా ఘటనలో దెబ్బతిన్న కుటుంబాలకు సహాయం చేయనున్నామని ఐసీసీకి తెలిపింది. ఉగ్రదాడిలో నష్టపోయిన 40 మంది జవాన్ల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేసిన ఐసీసీ.. బీసీసీఐకి అనుమతిలిచ్చింది. 
Read Also : బీజేపీ ఢిల్లీ అభ్యర్థిగా గౌతం గంభీర్?